RCBvsLSG: ఆర్సీబీ అదుర్స్..లక్నోకు భారీ టార్గెట్

RCBvsLSG: ఆర్సీబీ అదుర్స్..లక్నోకు భారీ టార్గెట్

లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు దుమ్ము రేపింది. లక్నో బౌలర్లను చితక్కొడుతూ 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మాక్స్ వెల్ చిచ్చర పిడుగులా రెచ్చిపోయాడు .

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరుకు ఓపెనర్లు కోహ్లీ, డు ప్లెసిస్ అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు.  ఇద్దరు పోటా పోటీగా బౌండరీలు బాదారు. సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించారు. వీరిద్దరు తొలి వికెట్ కు 96 పరుగులు జత చేశారు. ఇదే క్రమంలో కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అయితే ఈ సమయంలో  కోహ్లీ అమిత్ షా పెవీలియన్ పంపాడు. 

మాక్స్ వెల్ విధ్వంసం..

కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్..తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సిక్సులతో విరుచుకుపడ్డాడు. మాక్స్ వెల్ తో పాటు..డు ప్లెసిస్  సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరు పోటీ పడి మరీ పరుగులు సాధించడం విశేషం. ఇదే క్రమంలో మాక్స్ వెల్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 59 పరుగులు సాధించాడు. అటు డు ప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 79 రన్స్ కొట్టాడు. చివర్లో మాక్స్ వెల్ ఔటయ్యాడు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, అమిత్ మిశ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.