RR vs RCB: చరిత్ర సృష్టించిన చాహల్.. రాయల్స్ తొలి బౌలర్‌గా రికార్డు

RR vs RCB: చరిత్ర సృష్టించిన చాహల్.. రాయల్స్ తొలి బౌలర్‌గా రికార్డు

అహ్మదాబాద్ వేదిక‌గా బెంగళూరుతో జ‌రుగుతున్న ఎలిమినేట‌ర్‌ మ్యాచ్‌లో రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సరికొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఔట్ చేసిన చాహల్.. రాజస్థాన్ తరుపున ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.  రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలరైన చాహల్ తన ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీని ఔట్ చేయడం ఇదే తొలిసారి.

చాహల్ ఇప్పటికే రాయల్స్‌కు అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్‌ను దాటేశాడు.

రాజస్థాన్ తరఫున అత్యధిక ఐపీఎల్  

  • యుజ్వేంద్ర చాహల్: 66 వికెట్లు
  • సిద్ధార్థ్ త్రివేది: 65 వికెట్లు
  • షేన్ వాట్సన్: 61 వికెట్లు
  • షేన్ వార్న్: 57 వికెట్లు
  • జేమ్స్ ఫాల్క్‌నర్: 47 వికెట్లు

అదే సమయంలో చాహల్ ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా ఉన్నాడు. 2014 నుండి 2021 వరకు బెంగళూరు తరపున ఆడిన ఈ మిస్టరీ స్పిన్నర్ 113 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో చాహల్ అత్యుత్తమ ప్రదర్శన కనపరిచాడు. 14 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.