
హైదరాబాద్, వెలుగు: ఆర్డీ ఇంజనీరింగ్ సైనిక్ స్కూల్స్ అలుమ్ని గోల్ఫ్ టోర్నమెంట్‌లో కోరుకొండ సైనిక్ స్కూల్ టీమ్ చాంపియన్‌గా నిలిచింది. సైనిక్ స్కూల్ చిత్తోర్‌గఢ్ రన్నరప్ ట్రోఫీ గెలిచింది. హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్, కంట్రీ క్లబ్‌లో రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నీలో దేశంలోని అన్ని సైనిక్ స్కూల్స్ పూర్వ విద్యార్థులు తొలిసారిగా ఒకే వేదికపైకి వచ్చి ఉత్సాహంగా పోటీపడ్డారు.
వ్యక్తిగత విభాగాలలోనూ కోరుకొండ సత్తా చాటింది. డైమండ్ కేటగిరీలో కమాండర్ ఎస్. గంగాధర్ విజేతగా, కల్నల్ టి. సాంబయ్య రన్నరప్‌గా నిలిచారు. లెఫ్టినెంట్ కల్నల్ హేమంత్ రాజ్ (సైనిక్ స్కూల్ కజికుట్టం)కు బెస్ట్ గోల్ఫర్ అవార్డు దక్కింది. స్టాల్‌వార్ట్స్ గోల్ఫ్ డైరెక్టర్ బ్రిగేడియర్ డి.వి. సింగ్ (రిటైర్డ్), ఆర్డీ ఇంజనీరింగ్ లిమిటెడ్ చైర్మన్ చంద్రశేఖర్ మోటూరు విజేతలకు ట్రోఫీలు అందజేశారు.