హైదరాబాద్, వెలుగు: నిరుడు నవంబరులో ప్రైవేటు కాలేజీల సమ్మె కారణంగా పరీక్షలకు దూరమైన బీఫార్మసీ విద్యార్థులకు జేఎన్టీయూహెచ్ పరీక్షలు రాసేందుకు అవకాశం ఇచ్చింది. నవంబరు 4, 6వ తేదీల్లో జరగాల్సిన బీఫార్మసీ పరీక్షలకు అప్పట్లో హాజరుకాలేకపోయిన వారి కోసం ప్రత్యేకంగా రీ-ఎగ్జామ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకార ఈ నెల 27, 29న పరీక్షలు నిర్వహించనున్నారు.
అయితే.. సమ్మె వల్ల హాజరుకాలేకపోయిన వారే కాకుండా.. పరీక్ష రాసినవారికి కూడా అవకాశం కల్పించారు. అప్పుడు ఎగ్జామ్ కు హాజరైన వారు మళ్లీ పరీక్ష రాసుకునేందుకు చాన్స్ ఇచ్చారు. అయితే, పాత మార్కులను వదులుకుంటామని అండర్ టేకింగ్ ఇచ్చి మళ్లీ పరీక్షకు హాజరు కావచ్చని వర్సిటీ అధికారులు ప్రకటించారు.
