గుడ్ల సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రీ టెండర్..బిడ్డర్ చేతులెత్తేయడంతో కొత్త కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సప్లై బాధ్యత

గుడ్ల సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రీ టెండర్..బిడ్డర్ చేతులెత్తేయడంతో  కొత్త కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సప్లై బాధ్యత
  • పాత కాంట్రాక్టర్ ఈఎండీ రూ. 7 లక్షలు జప్తు
  • స్కూల్స్, కేజీబీవీ, హాస్టల్స్, గురుకుల స్టూడెంట్స్ కోసం గుడ్ల టెండర్లు 

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి జిల్లాలో కోడిగుడ్ల సప్లయ్​కోసం రీ టెండర్ల బిడ్లను తెరిచారు. గతంలో పలికిన రేటు కంటే ఈసారి రూ.  0.43 పైసలు అదనపు రేటుతో గుడ్ల సప్లయ్​కాంట్రాక్టు అప్పగించారు.  అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లు, గురుకులాలు, హాస్టల్స్, కేజీబీవీ విద్యా సంస్థలకు ఒకే కాంట్రాక్టర్, ఒకే విధమైన రేటుతో గుడ్లను సప్లయ్​ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల వారీగా వేర్వేరుగా కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు పిలిచారు.  ఒక్కో గుడ్డు 45 గ్రాముల నుంచి 50 గ్రాముల సైజులో సప్లయ్​ చేయాలని టెండర్​లో పేర్కొన్నారు. 

తక్కువ రేటు వేసి..  చేతులెత్తేసిన కాంట్రాక్టర్​

రూల్స్​ ప్రకారం టెండర్లలో ఎవరు తక్కువ రేటుకు సప్లయ్​చేస్తారో వారికే టెండర్​ దక్కుతుంది. గత నెలలో ఈ టెండర్లను నిర్వహించగా ఐదుగురు కాంట్రాక్టర్లు రూ. 7 లక్షల చొప్పున ఈఎండీ చెల్లించి బిడ్లు దాఖలు చేశారు. వీరిలో ఓ కాంట్రాక్టర్​ రూల్స్​ ప్రకారం అవసరమైన డాక్యూమెంట్​దాఖలు చేయకపోవడంతో అతడి టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను​తిరస్కరించారు. 

మిగిలిన నలుగురిలో ఇద్దరు ఒక్కో గుడ్డుకు రూ. 6.42 కోట్​ చేయగా, మరో వ్యక్తి రూ.6.36 కోట్​చేశారు. ఒక్కో గుడ్డును రూ. 5.85 చొప్పున కోట్ చేసిన చేయడానికి ఖమ్మం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ టెండర్​ దక్కించుకున్నారు. అయితే రూ. 5.85కు గుడ్డును సరఫరా చేయడానికి ఒప్పుకున్న కాంట్రాక్టర్​ తన వల్ల కాదని చేతులెత్తేశాడు. దీంతో అతడి ఈఎండీ రూ. 7 లక్షలు జప్తు చేసిన ఆఫీసర్లు రీ టెండర్లు పిలిచారు. 

‘ నెక్’  రేటు కంటే..

జిల్లాల్లో కోడి గుడ్లకు టెండర్​ పిలిచిన సమయంలో  ‘నెక్’  రేటు దాదాపుగా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభం నుంచి ఫారం ధరగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కో గుడ్డు రేటు రూ. 5.25, వరంగల్​లో రూ. 5.27 గా ఉంది. ప్రస్తుతం ‘నెక్​’ రేటు ప్రకారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కో గుడ్డుకు రూ. 5.40 ఉండగా వరంగల్​లో రూ. 5.42గా ఉంది. ఈ లెక్కన యాదాద్రి జిల్లాలో ఒక్కో గుడ్డుకు రూ. 0.88 నుంచి రూ. 0.90 ఎక్కువ రేటుకు సరఫరా అప్పగించారు. బహిరంగ మార్కెట్లో గుడ్డు ధర 
రూ. 6గా ఉంది. 

రూ. 6.28కి గుడ్డు

తాజాగా పిలిచిన టెండర్లలో ఇద్దరు మాత్రమే బిడ్లు దాఖలు చేశారు.  వీటిని అడిషనల్​ కలెక్టర్​ఏ. భాస్కర్​రావు ఆధ్వర్యంలో కొనుగోలు కమిటీ సమక్షంలో బిడ్లు ఓపెన్​చేశారు. ఒకరు రూ. 6.66 దాఖలు చేయగా, మరొకరు రూ. 6.49 చొప్పున బిడ్ దాఖలు చేశారు.  దీంతో రూ. 6.49 రేటు కోట్​ చేసిన కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చర్చలు జరిపిన ఆఫీసర్లు, తక్కువ రేటుకు సరఫరా చేస్తే కాంట్రాక్ట్​ ఇస్తామని చెప్పారు.  దీంతో చివరకు రూ. 6.28కి ఒక గుడ్డు చొప్పున సరఫరా చేయడానికి సదరు కాంట్రాక్టర్​ ఒప్పుకున్నాడు. ఈ రేటుకే జిల్లాలోని 62, 400  మంది స్టూడెంట్స్​కు 1,63,18,000 గుడ్లు సప్లయ్​ చేయాల్సి ఉంటుంది.