అవతార్‌ 2 మూవీ రిలీజ్‌కు రెడీ

అవతార్‌ 2 మూవీ రిలీజ్‌కు రెడీ

హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ మూవీ రికార్డులు బ్రేక్ చేసింది. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్‌ సినిమా సీక్వెల్స్‌తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రానుంది. అవతార్‌ 2 మూవీ డిసెంబరు 18, 2020న విడుదల అవుతుందని కొంత కాలమే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు. తాజాగా చిత్రాన్ని డిసెంబరు 17, 2021న విడుదల చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇటీవల అవతార్‌ ఫ్యామిలీలోకి రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రెండెన్‌ ఎంటర్‌ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం లైవ్‌ యాక్షన్‌ సీన్స్‌ను న్యూజిలాండ్‌ ప్రాంతాల్లో షూట్  చేశారు.