బీజేపీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు రెడీ : జీవిత రాజశేఖర్

బీజేపీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు రెడీ : జీవిత రాజశేఖర్

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి జీవిత రాజశేఖర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి( మం) కొప్పూరు గద్దల బండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కుండ చికెన్ కుమార్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీవిత పాల్గొన్నారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని జీవిత అన్నారు. కొవిడ్ సమయంలో తన భర్త రాజశేఖర్ కు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి అభిమానులు ఇచ్చిన మద్దతును జీవితంలో మర్చిపోలేమని చెప్పారు.

బతుకు జట్కా బండి కార్యక్రమం ద్వారా కొన్ని వేల కుటుంబాలను ఏకం చేసే అదృష్టం  దక్కిందని జీవిత తెలిపారు. మంచి అవకాశం వస్తే భవిష్యత్తులో తప్పకుండా సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేశారు. ప్రతి నటుడు గ్రామీణ స్థాయి నుంచి వచ్చి, కష్టపడి, ఎదిగి స్టార్ డమ్ సంపాదించుకున్న వారేనని ఈ సందర్భంగా ఆమె అన్నారు.  గ్రామీణ ప్రాంతాలనుంచి వస్తున్న కళాకారులను ప్రతి ఒక్కరు ఆదరించాలని జీవిత కోరారు.