భార్యను గొలుసుతో కట్టేసిన భర్త..కరీమాబాద్‌‌లో అమానుషం

భార్యను గొలుసుతో కట్టేసిన భర్త..కరీమాబాద్‌‌లో అమానుషం

ఖిలా వరంగల్ (వరంగల్), వెలుగు : వరంగల్​జిల్లా కరీమాబాద్‌‌లో భార్యాభర్తల బంధానికి మచ్చతెచ్చేలా ఓ భర్త అమానవీయంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదే గ్రామంలో ఉన్న అత్తవారి ఇంటి వద్ద భార్యను గొలుసుతో కట్టేసి కనీస సౌకర్యాలు లేకుండా చీకట్లో ఇంటి బయటే వదిలేయడంతో ఆమె నిస్సహాయ స్థితిలో తీవ్ర ఇబ్బంది పడింది. 

భర్త ఎందుకు ఇలా చేశాడని బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించగా, అతడు ఎందుకు ఇలా చేశాడో తమకూ తెలియడం లేదన్నారు. చలించిపోయిన స్థానికులు భర్త తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళకు రక్షణ కల్పించి అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే భర్త ఆమెను పుట్టింటి వద్ద అలా కట్టేసి వెళ్లిపోయాడని సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.