
న్యూఢిల్లీ: జేఎస్డబ్ల్యూ స్టీల్, దక్షిణ కొరియాకు చెందిన పోస్కో గ్రూప్ భారతదేశంలో ఏటా 6 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) కెపాసిటీతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి. ప్లాంటు పెట్టబోయే ప్రాంతం, పెట్టుబడి నిబంధనలు, వనరుల లభ్యత, ఇతర కీలక అంశాలను ఖరారు చేయడానికి రెండు కంపెనీలూ కలిసి స్టడీ చేస్తాయి.
ప్లాంట్‌ను ఏర్పాటుకు నాన్-బైండింగ్ హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్ (హెచ్ఓఏ)పై సంతకం చేసినట్లు జేఎస్డబ్ల్యూ స్టీల్ సోమవారం తెలిపింది. సహజ వనరుల లభ్యత బాగుండటం, లాజిస్టికల్ ప్రయోజనాల దృష్ట్యా ఒడిశా రాష్ట్రాన్ని ప్లాంటు ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.