'ది ఎలిఫెంట్ విస్పరర్స్‌' నటులకు సీఎం సత్కారం

'ది ఎలిఫెంట్ విస్పరర్స్‌' నటులకు సీఎం సత్కారం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ఆస్కార్ అవార్డు దక్కించుకున్న డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్‌'లో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులను కలిశారు. అనంతరం వారిని సత్కరించి...  ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున నగదు బహుమతిని అందజేశారు. దాంతో పాటు రాష్ట్రంలోని రెండు ఏనుగుల శిబిరాల్లోని మొత్తం 91 మంది కార్మికులకు లక్ష రూపాయల చొప్పున అందించారు. కోయంబత్తూరులో కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడు అటవీ శాఖ ఏనుగుల సంరక్షణపై తీసిన ఈ చిత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని ఆయన చెప్పారు.

తమిళనాడు నీలగిరిలోని సుందరమైన ముదుమలై అడవుల్లో నివసించే కట్టునాయకన్ తెగకు చెందిన స్థానిక దంపతులైన బొమ్మన్, బెల్లి సంరక్షణలో ఉన్న రఘు అనే అనాథ ఏనుగు పిల్ల కథే ది ఎలిఫెంట్ విస్పరర్స్. 40 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీని కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిగా గునీత్ మోంగా నిర్మించారు. ఈ చిత్రంలో మనుషులకు, ఏనుగుకు మధ్య ఆత్మీయ అనుబంధంతోపాటు.. ప్రకృతి అందాలను అందంగా చూపించారు.