
ఆర్థిక ఇబ్బందులు తాళలేక రియల్టర్లు చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బలవనర్మణాలకు పాల్పడుతున్నారు. శుక్రవారం (జూలై18) హైదరాబాద్ లోని మీర్ పేట్ ప్రశాంత్ హిల్స్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్రి వెంకటేశ్వర్లు(47) ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళితే..
మీర్ పేట్ పరిధిలో ప్రశాంత్ నగర్ కాలనీలో కుటుంబంతో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ బిల్డర్ మర్రి వెంకటేశ్వర్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇంజమూర్ లోని సాయిప్రియ కాలనీలో ఉన్న తన ప్లాట్ లో ఉరివేసుకొని చనిపోయాడు. వెంకటేశ్వర్లు భార్య ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ALSO READ : ఇన్వెస్టిగేషన్ పూర్తికాకుండానే నిందలా?..పైలట్ల సంఘం ఫైర్
రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో ఆర్థిక ఇబ్బందుతు తలెత్తడంతో ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లో రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.