రియల్‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్ ఇంకో పదేళ్లలో రూ.108 లక్షల కోట్లకు!

రియల్‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్ ఇంకో పదేళ్లలో రూ.108 లక్షల కోట్లకు!

న్యూఢిల్లీ :  రియల్‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్ సైజ్‌‌‌‌ 2034 నాటికి  1.3 ట్రిలియన్ డాలర్ల (రూ.108 లక్షల కోట్ల) కు, 2047 నాటికి 5.17 ట్రిలియన్ డాలర్ల (రూ.429 లక్షల కోట్ల) కు  చేరుకుంటుందని క్రెడాయ్ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ సెక్టార్ సైజ్ రూ.24 లక్షల కోట్లు (300 బిలియన్ డాలర్లు). దేశ రియల్ ఎస్టేట్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో 8‌‌‌‌‌‌‌‌0 శాతం వాటా  రెసిడెన్షియల్ విభాగానిది కాగా, కమర్షియల్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌కు 20 శాతం వాటా ఉంది. 

2034 నాటికి జీడీపీలో ఈ సెక్టార్ వాటా 13.8 శాతానికి పెరుగుతుందని, 2047 నాటికి 17.5 శాతానికి పెరుగుతుందని క్రెడాయ్ రిపోర్ట్ అంచనా వేసింది. రెసిడెన్షియల్ సెగ్మెంట్‌‌‌‌లో  65 శాతం ఇండ్లు రూ.45 లక్షల కంటే పైనే ఉన్నాయని తెలిపింది. ఇంటి విస్తీర్ణం కూడా 11 శాతం పెరిగిందని పేర్కొంది. 2030 నాటికి అదనంగా ఏడు కోట్ల ఇండ్లు అవసరమవుతాయని క్రెడాయ్ అంచనా వేసింది. ఈ ఇండ్లలో 87.4 శాతం రూ.45 లక్షల పైనే ఉంటాయని తెలిపింది.