లాంచింగ్ ముందే హల్చల్ చేస్తున్న Realme12 సిరీస్ స్మార్ట్ఫోన్లు

లాంచింగ్ ముందే హల్చల్ చేస్తున్న Realme12 సిరీస్ స్మార్ట్ఫోన్లు

ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే Realme 12 Pro, Realme 12 Pro+ స్మార్ట్ ఫోన్లు హల్ చల్ చేస్తున్నాయి. టెలి కమ్యూనికేషన్స్ , డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) వెబ్ సైట్ లో వీటి వివరాలు వాటి రాకను సూచిస్తున్నాయి. Realme 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 5G కనెక్టివిటీతో త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. Realme 12 Pro, Realme 12 Pro+  రెండూ Qualcomm కొత్త స్నాప్ డ్రాగన్ 7Gen3 SoC రన్ అవుతాయి. ఈ హ్యాండ్ సెట్లు ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)  వెబ్ సైట్ లో కూడా కనిపించాయి. 

My Smart Price  నివేదిక ప్రకారం.. Realme 12 Pro, Realme 12 Pro+  రెండూ TDRA వెబ్ సైట్ లో వరుసగా RMX3842, RMX3840 మోడల్ నంబర్లతో కనిపించాయి. ఈ హ్యాండ్ సెట్లలో 5G కనెక్టివిటీని సూచిస్తుంది. ఈ మోడల్ నంబర్లు గతంలో BiS వెబ్ సైట్ లో కూడా గుర్తించబడ్డాయి. అయితే  TDRA జాబితా ఈ రెండు ఫోన్ల సంబంధించిన మరిన్ని  వివరాలు వెల్లడించలేదు. 

Realme 11 సిరీస్ స్నాప్ డ్రాగన్ 7Gen3SoCలో నడుస్తుందని చైనీస్ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఇటీవల లీక్ చేసింది.  ఇది రూ. 23వేలు  ధరతో మధ్య తరగతి స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో వస్తుందని తెలుస్తోంది. Realme12 Pro+ 64 మెగా పిక్సెల్ OsniVision OV64B పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది.. ఇది 3X ఆప్టికల్ జూమ్ ను అందించగలదు.   Realme12 Pro మాత్రం 2X ఆప్టికల్ జూమ్ తో సోని IMX709 సెన్సార్ తో వస్తుందట.