రియల్​మీ నార్జో సిరీస్​ నుంచి మరో రెండు ఫోన్లు

రియల్​మీ నార్జో సిరీస్​ నుంచి మరో రెండు ఫోన్లు

స్మార్ట్​ఫోన్ ​బ్రాండ్​ రియల్‌‌‌‌‌‌‌‌మీ నార్జో 70ఎక్స్, నార్జో 70 పేరుతో మిడ్​రేంజ్ ​బడ్జెట్​ 5జీ ఫోన్​ను లాంచ్​ చేసింది. నార్జో 70 ఎక్స్​లో 45 వాట్ల సూపర్‌‌‌‌‌‌‌‌వూక్ చార్జింగ్​ను సపోర్ట్​ చేసే  భారీ 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ,  120 హెట్జ్​ అల్ట్రా స్మూత్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే, వీసీ కూలింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌, డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్​, 50 ఎంపీ ఏఐ కెమెరా, కేవలం 7.69 ఎంఎం అల్ట్రా-స్లిమ్ బాడీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 

4జీబీ+128జీబీ ధర రూ. 11,999 కాగా,  6జీబీ + 128జీబీ వేరియంట్​ ధర రూ. 13,499.  రియల్‌‌‌‌‌‌‌‌మీ నార్జో 70 5జీలో మీడియాటెక్​ డైమెన్సిటీ 7050 5జీ చిప్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. దీని ధరలు రూ.16 వేల నుంచి మొదలవుతాయి. సేల్​సమయంలో (ఈ నెల 29) అమెజాన్​లో పలు ఆఫర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.