67 వాట్ల చార్జింగ్​తో రియల్​మీ 11

67 వాట్ల చార్జింగ్​తో రియల్​మీ 11

రియల్​మీ  తన మిడ్-రేంజ్ బడ్జెట్​ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్11 5జీ ని లాంచ్​ చేసింది. ఇందులో 108 ఎంపీ మెయిన్​ కెమెరా 67 వాట్ల సూపర్​వూక్​ ఛార్జింగ్ సొల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,   మీడియాటెక్  డైమెన్సిటీ  6100 ప్లస్​ ప్రాసెసర్​, 16 జీబీ వరకు డైనమిక్ ర్యామ్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. 8జీబీ+128 జీబీ వేరియంట్​ ధర రూ.19 వేలు కాగా, 8జీబీ+256 జీబీ వేరియంట్​ ధర రూ.20 వేలు. అమ్మకాలు ఈ నెల 29 నుంచి మొదలవుతాయి.

ఘనంగా జూమ్ ఎక్స్​పీరియెన్స్​ డే

జూమ్ ఆధ్వర్యంలో జూమ్ ఎక్స్​పీరియెన్స్​డేను హైదరాబాదులోని ఒక హోటల్లో  నిర్వహించారు. తమ టెక్నాలజీల ద్వారా కంపెనీల సామర్థ్యం ఎలా పెరుగుతుందో ఈ సందర్భంగా వివరించారు. జూమ్​లో టీమ్ చాట్, మీటింగ్స్, కాంటాక్ట్, స్మార్ట్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  జూమ్ ఐక్యూ, వైట్​బోర్డ్​, జూమ్ షెడ్యూలర్, జూమ్ కాంటాక్ట్ సెంటర్ వంటివి కంపెనీలకు ఎంతో మేలు చేస్తాయని సంస్థ తెలిపింది.