రియల్‌మీ నార్జో ఎన్53 పేరుతో సన్నటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ ఫోన్‌లో 33 వాట్ల సూపర్ వీఓఓసీ ఛార్జింగ్, 50 ఎంపీ ఏఐ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.8,999. బాడీ సైజ్ 7.49 మిల్లీమీటర్లే. ఈ నెల 24 నుంచి వీటి సేల్స్ స్టార్టవుతాయి.
