పుష్ప2 ఆలస్యానికి కారణం.. షాకవుతున్న ఫ్యాన్స్

పుష్ప2 ఆలస్యానికి కారణం.. షాకవుతున్న ఫ్యాన్స్

ప్రస్తుతం నేషనల్ వైడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో అల్లు అర్జున్(Allu arjun) హీరోగా వస్తున్న పుష్ప2(Pushpa2) ఒకటి. పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ  పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ లెవల్లో పుష్ప2ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ కోసం అటు నార్త్ ఆడియన్స్, ఇటు సౌత్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పుష్ప2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను 2024 స్వతంత్ర దినోత్సవ సందర్బంగా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ డేట్ చూసి అవాక్కవుతున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలమే అవుతుందిగా ఎందుకు ఇంత ఆలస్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

పుష్ప2 రిలీజ్ కు ఎందుకంత ఆలస్యం?

నిజానికి పుష్ప స్క్రిప్ట్ వర్క్ కోసమే దాదాపు సంవత్సర కాలం తీసుకొన్నారు మేకర్స్. ఆతరువాత ప్రీ ప్రొడక్షన్ కోసం మరో ఆరునెలల సమయం పట్టింది. దీంతో చాలా ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్ళింది పుష్ప. ఇక పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఏర్పడటంతో ముందు అనుకున్న కథలో చాల మార్పులు చేశారు. ఇందుకోసం కొత్త సెట్స్ కూడా వేయాల్సి వచ్చింది. ఆ కారణంగా కూడా పుష్ప షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. 

2023లో రాకపోవడానికి కారణం?

పుష్ప2 సినిమాను ముందుగా 2023 ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. అయితే సీజీ వర్క్, కాస్త ప్యాచ్ వర్క్ షూటింగ్ కూడా బ్యాలన్స్ పడింది. ఆ కారణంగా సినిమాను 2023 ఎండింగ్ కు వాయిదా వేశారు. కానీ 2023 ఇయర్ ఎండింగ్ లో వరుసగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసుకొని ఉన్నాయి. పుష్ప కారణంగా ఆ సినిమాల రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయలేక పుష్ప సినిమాను ఆగస్టు కు వాయిదా వేశారు.

సంక్రాంతి బరిలో ఎందుకు నిలువలేదు?

సంక్రాంతి బరిలో ఇప్పటికే.. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, నాగార్జున వంటి స్టార్స్ సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని సినిమాలు వాయిదాకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి సంక్రాంతి సీజన్ నుండి పుష్ప తప్పుకున్నాడు. ఆ తరువాత కూడా రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఏప్రిల్ లో ఎన్టీఆర్ దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వరుస భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో.. పుష్ప2 సినిమాను 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు మేకర్స్.