జుట్టు బూడిద రంగులోకి మారడానికి కారణాలేంటి.? అధ్యయనం ఫలితాలివే..

జుట్టు బూడిద రంగులోకి మారడానికి కారణాలేంటి.?  అధ్యయనం ఫలితాలివే..

మనిషి జుట్టు బూడిద రంగులోకి మారడానికి కారణాలను శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. నేచర్​ జర్నల్​అధ్యయనం ప్రకారం.. జుట్టు వయస్సు పెరిగే కొద్ది దాని మూలకణాలు చిక్కుకుపోవచ్చు. దీంతో జుట్టు రంగుని కొనసాగించే సామర్య్థాన్ని కణాలు కోల్పోతాయి.ఎలుకలు, మానవుల చర్మంలోని కణాలపై చేసిన పరిశోధనల్లో ఇది బయటపడింది. వీటినే మెలనోసైట్​స్టెమ్​సెల్స్​అని పిలుస్తారు. న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాస్​మన్ స్కూల్​ ఆఫ్​ మెడిసన్​ పరిశోధకుల నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం.. కొన్ని మూలకణాలు కంపార్ట్​మెంట్ల మధ్య కదిలే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి వయస్సు పెరిగే కొద్ది చిక్కుకుపోతాయి. దీంతో జుట్టు రంగు కాపాడుకునే శక్తి కోల్పోతుంది.

క్రమేణా జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. మెలనోసైట్ స్టెమ్ సెల్స్ ఎలా పనిచేస్తాయనే దానిపై  అధ్యయనం చేస్తున్నామని ఎన్​వైయూ లాంగోన్ హెల్త్‌ పోస్ట్‌డాక్టోరల్ పర్సన్ క్విసన్​ చెప్పారు. ఎలుకలపై చేసిన ప్రయోగాలలో, వాటి వెంట్రుకలు వయస్సు పెరిగే కొద్దీ రాలడం, మళ్లీ పెరగడాన్ని గమనించామని ఆయన తెలిపారు. ఎన్​వైయూ ప్రొఫెసర్​మయూమి ఇటో మాట్లాడుతూ.. ఈ పరిశోధనలు జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యమని సూచిస్తున్నాయని తెలిపారు.