Fire accident : అదుపులోకి రాని మంటలు.. కారణాలివే.. 

Fire accident : అదుపులోకి రాని మంటలు.. కారణాలివే.. 

షాపింగ్ కాంప్లెక్స్ లో అంటుకున్న మంటలు ఆరేడు గంటలు గడిచినా అదుపులోకి రాకపోవడానికి బిల్డింగ్ ను గోడౌన్ గా వినియోగించడమే కారణమని అధికారులు అంటున్నారు. 5 అంతస్థుల బిల్డింగ్ మొత్తాన్ని గోడౌన్ కోసమే వాడుతున్నారని గుర్తించారు. బిల్డింగ్ సెల్లార్ సహా అన్ని ఫ్లోర్లలో రెగ్జిన్ మెటీరియల్, ఫ్యాబ్రిక్ ఉండటం మంటలు ఉవ్వెత్తున ఎగిసేందుకు కారణమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రెగ్జిన్ కాలిపోవడం వల్ల దట్టమైన పొగ వ్యాపిస్తోందని  అంటున్నారు. 20 నిమిషాల పాటు అదే పనిగా వాటర్ పంప్ చేసినా మంటలు అదుపులోకి రావడం లేదని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటి వరకు 15 ఫైరింజన్లను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. భారీగా రెగ్జిన్, బట్టలు నిల్వ చేయడంతోనే ఇంత భారీ స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయని అధికారులు అంటున్నారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ ను కమర్షియల్ కోసం వాడుతున్నారని, అనుమతులు లేకుండానే గోడౌన్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు.