
- వీకెండ్‌లో సినిమాలు చూస్తూ టైంపాస్
జైపూర్: జైపూర్‌లోని లగ్జరీ రిసార్ట్‌లో ఉన్న అశోక్ గెహ్లాట్ టీమ్ ఎమ్మెల్యేలు వీకెండ్‌ను చాలా ఆనందంగా టైం పాస్ చేస్తున్నారు. హోటల్ లాన్‌లో యోగా చేస్తూ, సినిమాలు చూస్తూ గడుపుతున్నారు. అంతే కాకుండా హోటల్‌లో ని టాప్ చెఫ్ దగ్గర కొత్త కొత్త వంటలు కూడా నేర్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలంతా క్యాజువల్ డ్రస్సులు వేసుకుని గార్డెన్‌లో యోగా చేస్తున్న ఫొటోలు, టాప్ చెఫ్‌తో కలిసి వంట గదిలో వంటలు నేర్చుకుంటున్న ఫొటోలు బయటికి వచ్చాయి. అంతే కాకుండా వాళ్ల కోసం పాత బాలివుడ్ సినిమాలు కూడా వేస్తున్నారంట. కాంగ్రెస్ పార్టీ వేటు వేసిన 19 మంది రెబల్ ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చేందుకు హైకోర్టు మంగళవారం వరకు గడువు ఇవ్వడంతో వాళ్లంతా అప్పటి వరకు రిసార్ట్‌లోనే ఉంటారని తెలుస్తోంది.
మానేసర్ రిసార్ట్‌లో కనిపించని పైలెట్ వర్గం ఎమ్మెల్యేలు
సచిన్‌పైలెట్‌కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరిపై కాంగ్రస్ కేసు పెట్టింది. దీంతో వాళ్లిద్దర్నీ అరెస్టు చేసేందుకు పోలీసులు మానేసర్ రిసార్ట్‌కు వెళ్లగా అక్కడ పైలెట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అక్కడ లేరని పోలీసులు చెప్పారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన టీమ్స్ ఖాళీ చేతులతో తిరిగొచ్చారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు. కాగా ఆ 18 మందిని బీజేపీ కర్నాటకకు ఫిష్ట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీజేపీ ఎమ్మెల్యేలను కర్నాటకకు తరలించే వరకు రాజస్థాన్ పోలీసులను హర్యానా పోలీసులు రిసార్ట్‌లోకి అనుమతించలేదని రాజస్థాన్ కాంగ్రెస్ కొత్త చీఫ్ గోవింద్ సింగ్ దొతాస్రా ఆరోపించారు.