రామగుండంలో TRSకు రెబల్స్ దడ!

రామగుండంలో TRSకు రెబల్స్ దడ!

రామగుండంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గెలిచిన కోరుకంటి చందర్, అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలోనే అధికారపార్టీ మున్సిపల్ ఎన్నికలకు వెళ్తోంది. ఆయన అనుచరులు ఒక్కో డివిజన్‌ నుంచి ఐదారుగురు టికెట్లు ఆశించారు. వీరంతా అప్పట్లో కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ విజయానికి సహకారం అందించారు. వారందరికీ టికెట్లు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో టికెట్లు దక్కని చాలా మంది టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ రెబల్స్‌‌‌‌‌‌‌‌గా బరిలో నిలిచారు. ముఖ్యంగా కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ బాటలోనే నడిచి ఆల్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి చెందిన సింహం గుర్తుపైనే పోటీచేస్తున్నారు. తాము ఎమ్మెల్యే అనుచరులమేననీ, తమనే గెలిపించాలని రెబల్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్న తీరు, టీఆర్ఎస్ క్యాండిడేట్లకు ఇబ్బందిగా మారింది. గత ఎన్నికలతో పోలిస్తే తాజాగా బీజేపీ బలపడితే, కాంగ్రెస్ ఇంటిపోరుతో సతమతమవుతోంది. 50 డివిజన్లలో ఏకంగా133 మంది ఇండిపెండెంట్లు పోటీచేస్తుండడం ప్రధానపార్టీలను కలవరపెడుతోంది.

మేయర్​ సీటు కోసం పోటాపోటీ..

మేయర్‌‌‌‌‌‌‌‌ స్థానం ఎస్సీ జనరల్‌‌‌‌‌‌‌‌కు రిజర్వ్​అయింది. మొత్తం 5 0 డివిజన్లు కాగా, ఎస్సీ మహిళకు ఐదు డివిజన్లు, ఎస్సీ జనరల్ కు ఆరు డివిజన్లు కేటాయించారు. ప్రస్తుతం ఆయా డివిజన్లలో పోటీ ఎక్కువగా ఉంది. వీటిలో గెలిచినవారే మేయర్‌‌‌‌‌‌‌‌ పీఠాన్ని అధిష్టించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు పార్టీలేవీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రధానంగా 29వ డివిజన్‌ లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌ జాలి రాజమణి, 30వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ నుంచి 29వ డివిజన్‌ బరిలో ఉన్న మహాంకాళి స్వామి మేయర్‌‌‌‌‌‌‌‌ రేసులో ఉన్నారు. ఇక బీజేపీ ఆయా డివిజన్లలో గెలిచిన అభ్యర్థుల్లోంచి ఒకరిని మేయర్ స్థానానికి ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

ఐదేళ్ల క్రితం స్వతంత్రుడే మేయర్​..

రామగుండం కార్పొరేషన్‌కు 2014లో ఎన్నికలు జరగగా, 50 డివిజన్లకు గాను 19 స్థానాల్లో కాం గ్రెస్‌‌‌‌‌‌‌‌, 14 స్థానాల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. 15 స్థానాల్లో స్వంతంత్ర అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలో ఇండిపెండంట్ల పాత్ర కీలకంగా మారింది. మేయర్‌‌‌‌‌‌‌‌ స్థానం కోసం అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ప్రయత్నించినప్పటికీ అంతర్గత కలహాల వల్ల సాధ్యం కాలేదు. టీఆర్ఎస్ దీనిని అవకాశంగా తీసుకొని 12వ డివిజన్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కొంకటి లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకుని మేయర్‌‌‌‌‌‌‌‌ పీఠం ఎక్కించింది. బలంపుంజుకున్న బీజేపీ గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో మాత్రమే గెలిచిన భారతీయ జనతాపార్టీ ఈ సారి బలం పుంజుకు న్నది. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ఆ పార్టీలో చేరడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. ఈసారి ఆ పార్టీ అన్ని డివిజన్లలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. దీంతో పోటీ రసవత్తరంగా మారుతోంది.

పెద్దసంఖ్యలో ఇండిపెం డెంట్స్​..

50 డివిజన్లలో ఏకంగా133 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. వీరు పలు డివిజన్లలో తమ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముండడంతో ప్రధానపార్టీల అభ్యర్థులు కలవరపడుతున్నారు.