దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

ఢిల్లీ : దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4.25 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,313 మంది వైరస్‌ బారినపడ్డారు. ముందురోజు కంటే నాలుగు వేలు అదనంగా కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 4.31 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 20,742 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 1.45 లక్షలకు తగ్గాయి. క్రియాశీల కేసుల రేటు 0.33 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.47 శాతంగా కొనసాగుతోంది. నిన్న  ఒక్కరోజే 57 మంది చనిపోయారు. 2020 సంవత్సరం నుంచి 4.39 కోట్ల మందికి కొవిడ్ వైరస్ సోకగా.. 4.32 కోట్ల మంది కోలుకున్నారు. 5.26 లక్షల మంది మరణించారు. నిన్న 27.37 లక్షల మంది టీకా తీసుకోగా.. 202.79 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.