పనీపాట లేక జుట్టు-గడ్డం పెంచాను : నాగ చైతన్య

పనీపాట లేక జుట్టు-గడ్డం పెంచాను : నాగ చైతన్య

నాగ చైతన్య తనదైన సినిమాలతో సినీ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఎత్తు పల్లాలను బ్యాలెన్స్ చేసుకుంటూ..తనకు సెట్ అయ్యే స్క్రిప్ట్స్ వింటూ బిజీగా ఉన్నాడు. చై గత చిత్రం కస్టడి మూవీ ఆడియాన్స్ ను డిస్సపాయింట్ చేయడంతో..తన నెక్స్ట్ పనిలో ఉన్నాడు. కాకపోతే చై తదుపరి సినిమా అనౌన్స్ చేసి చాన్నాళ్లు కావడంతో..ప్రసెంట్ గుబురు గడ్డం..జుట్టుతో కనిపించి..ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చేశాడు.

అసలు విషయానికి వస్తే..రీసెంట్గా స్టైలిష్ లుక్తో మీడియాకు కనిపించగా..అక్కడ ఓ రిపోర్దర్ అడిగిన ఓ ప్రశ్నకు చై సరదా సమాధానం ఇచ్చారు. ఇంట్లో అలా ఖాళీగా ఉండడం వల్ల, పనీపాట లేక ఇలా జుట్టు-గడ్డం పెంచానంటూ జోక్ చేశారు చై. ఆ తర్వాత  వెంటనే అసలైన సమాధానం కూడా ఇచ్చారు. దీంతో గడ్డం వెనుక ఇంత పెద్ద జోక్ ఉందా ..అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో చైతూకి జోడిగా సాయి పల్లవి నటిస్తోంది.  

నిజమైన సమాధానం చెబుతూ..కార్తికేయ ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్లో తెరక్కెక్కుతున్న సినిమా చేస్తున్నాని..అందుకోసం జుట్టు-గడ్డం పెంచానని చెప్పుకొచ్చాడు చైతూ. అంతేకాకుండా ఈ మూవీలో ఇప్పటికే లుక్టెస్ట్ లాక్ అయినట్టు తెలిపారు. ఇక ఈ మూవీలో ఉండే గెటప్ తో ఫస్ట్ లుక్ ఫొటోషూట్ అదిరిపోయేలా వచ్చిందని..త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం నాగచైతన్య ఇప్పటికే హోమ్ వర్క్ కూడా మొదలై పెట్టేశాడు. సిక్కోలు, మత్స్యకారుల యాస, వారి వ్యవహారాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నాడు నాగచైతన్య. గీత ఆర్ట్స్(Geetha arts) సంస్థ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే అధికారికంగా మొదలుకానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.