‘మ్యాడ్’ మూవీ ఎలా ఉందంటే..?

‘మ్యాడ్’ మూవీ ఎలా ఉందంటే..?

రివ్యూ: మ్యాడ్
రన్ టైమ్ : రెండు గంటలు
నటీనటులు: రజిత్, మాధవ్, స్పందన, శ్వేతా వర్మ తదితరులు
మ్యూజిక్: మోహిత్ రెహ్మానియాక్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్
సినిమాటోగ్రఫీ: రఘు మందాటి
నిర్మాతలు: వేణుగోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి
రచన, దర్శకత్వం: లక్ష్మణ రావు
రిలీజ్ డేట్: ఆగస్టు 6, 2021

కథేంటి?

మాధవ్, అరవింద్ (మాధవ్, రజత్) క్లోజ్ ఫ్రెండ్స్. మాధవ్ రిచ్ కిడ్.. అమ్మాయిలతో క్లోజ్ అయి జల్సాలు చేస్తుంటాడు. ఇతనికి పెళ్లి చేస్తారు. అయితే వీళిద్దరికీ పడక విడాకులకు అప్లై చేస్తారు. అరవింద్ కూడా ఒక అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్‌‌లో ఉంటాడు. కొన్ని రోజులు ఎంజాయ్ చేసినా ఇతని ప్రవర్తన నచ్చక ఆమె విడిపోతుంది. ఈ రెండు జంటలు తిరిగి ఎలా ఒక్కటి అయ్యాయన్నదే మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

మాధవ్ చిలుకూరి, స్పందన పల్లిల జోడీ బాగుంది. వాళ్ల పాత్రల్లో బాగా నటించారు. రజత్ రాఘవ ఎంటర్ టైన్ చేస్తాడు. శ్వేతా వర్మ హాట్ సీన్లలో నటించి మెప్పించింది. వీళ్లిద్దరి జోడీ బాగుంది. మిగతా తారాగణం ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ వర్క్:

ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగా హెల్ప్ అయ్యాయి. మోహిత్ రెహ్మానియన్ మ్యూజిక్ హైలెట్‌‌గా నిలుస్తుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌‌తో మెప్పించాడు. రఘు మందాటి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మార్తండ్ కె. వెంకటేశ్ పనితనం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూయ్స్ ఫర్వాలేదు.

విశ్లేషణ: 

‘‘మ్యాడ్’’ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ప్రేమ, పెళ్లి, విడాకులు నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇకపోతే హాట్ సీన్లతో యూత్‌ను టార్గెట్ చేసినా.. కథ, కథనాలు పకడ్బందీగా లేవు. అందువల్ల కాస్త బోరింగ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త నీరసంగా ఉంటుంది. డైరెక్టర్ లక్ష్మణరావు తొలిసారి డైరెక్ట్ చేసినా ఫర్వాలేదనిపించాడు. ఇంకా కథ, కథనాల మీద దృష్టి పెడితే బాగుండేది. యూత్ ఆడియన్సే టార్గెట్‌గా తీశారు కాబట్టి వాళ్లకు నచ్చుతుంది. ఈ వీకెండ్ యూత్‌‌కు టైంపాస్ కావాలంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు.