డిప్రెషన్ బారిన పడ్డ వాళ్లను గుర్తించొచ్చిలా..

డిప్రెషన్ బారిన పడ్డ వాళ్లను గుర్తించొచ్చిలా..

ఒక్కోసారి దోస్తులు లేదా మనసుకు దగ్గరైన వాళ్ల ప్రవర్తన కొత్తగా అనిపిస్తుంది. ఏదో కోల్పోయినట్టు, ఏదో ప్రపంచంలో ఉంటారు. వాళ్లు ఎందుకలా చేస్తున్నారో అర్థం కాదు. విపరీతమైన కోపం, భయం, ఆందోళన వంటివి వాళ్లలో కనిపిస్తాయి. ఇవన్నీ డిప్రెషన్ బారిన పడినవాళ్లలో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలని ముందే పసిగడితే, వాళ్లని డిప్రెషన్ బారిన పడకుండా కాపాడొచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

ALSO READ :భోజనం చేసేందుకు పిల్లలు మారాం చేస్తున్నారా..
 

• ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, ఆందోళన పడడం వంటివి చేస్తున్నారంటే వాళ్లు డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్టే.

• కళ్లు అలసిపోయినట్టు, కళ్ల కింద ఉబ్బినట్టు ఉంటే కనుక 'ఏమైంది. అంతా ఓకేనా. దేని గురించైనా మాట్లాడాలి అనుకుంటున్నావా?' అని అడగాలి. అప్పుడు వాళ్లు చెప్పిన సమాధానం నిజమేనా లేక ఏదైనా దాస్తున్నారా! అనేది గమనించాలి.

• పాత విషయాలు గుర్తు పెట్టుకోకపోవడం, ఇక తమ వల్ల ఏమీ కాదు అను కోవడం వంటివి కూడా డిప్రెషన్ సంకేతాలే.

ఒక్కసారిగా లావెక్కినా, సన్నబడినా అందుకు వర్క్ ప్రెజర్ లేదా డైట్ ప్లాన్ కారణం కాకపోవచ్చు.. వాళ్లు ఫిజికల్ హెల్త్ మీద శ్రద్ధ పెట్టడం లేదని అర్థం