యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం

యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం
  • ఆదివారం ఒక్కరోజే రూ.45.50 లక్షల ఆమ్దానీ 

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు ఆదివారం రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. మార్చి 28న ప్రధానాలయం పునఃప్రారంభం అయ్యాక నిత్య ఆదాయంతో పాటు హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. వీకెండ్స్​లో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ ఆదివారం కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేయడంతో ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది.

ఒక్కరోజే రూ.45,50,079 ఇన్ కమ్ వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.17,12,600, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.6.75 లక్షలు, కొండపైకి వచ్చే కార్ల ప్రవేశ రుసుముతో రూ.4.50 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.5,81,600 ఆదాయం వచ్చింది. సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.2,13,748, సత్యనారాయణస్వామి వ్రత పూజలతో రూ.2.12 లక్షల ఇన్ కమ్ వచ్చింది. 2022లో ఇదే అత్యధిక ఆదాయమని ఆలయ ఆఫీసర్లు చెప్పారు.  

 

ఇవి కూడా చదవండి

మల్లారెడ్డికి నిరసన సెగ

బండి సంజయ్​కి బుల్లెట్ ప్రూఫ్ కారు

ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే చికిత్స