మిర్చి క్వింటాల్ రూ.20 వేలు.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు ధర

మిర్చి క్వింటాల్ రూ.20 వేలు.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు ధర

హైదరాబాద్: వరంగల్ ఏనుమాముల వ్యవ-సాయ మార్కెట్‎లో ఇవాళ తేజ రకం మిర్చికి -రికార్డు ధర పలికింది. జాఫర్ ఘడ్ మండలం కునూర్ గ్రామానికి చెందిన రైతు సమ్మిరెడ్డి తెచ్చిన ఈ రకం మిర్చికి క్వింటాలుకు రూ.20,200 వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇక్కడి మార్కెట్‎లో 2023 తరవాత ఈ రకం మిర్చికి అత్యధిక ధర ఇవాళే వచ్చింది. గడిచిన నెల రోజులుగా రైతులు కొత్త మిర్చితో పాటు పాత మిర్చిని తీసుకువచ్చి అమ్మకాలు చే స్తున్నారు. ప్రతి రోజు వంద నుంచి రెండు వందల క్వింటాళ్ల వరకు మిర్చి మార్కెట్ కు వస్తోంది.