రూ. 2.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

రూ. 2.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
  •     మెరిసిన బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఆటో, మెటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీ షేర్లు

ముంబై : బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఆటో, మెటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బుధవారం కొత్త రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను క్రియేట్ చేశాయి.  స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాప్, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వెనక్కి నెట్టి  సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 702 పాయింట్లు పెరిగి 72,038 దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ 213 పాయింట్లు లాభపడి 21,655 దగ్గర సెటిలయ్యింది. అల్ట్రాటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు 4 శాతం పెరిగి టాప్ గెయినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి.  సిమెంట్ సెక్టార్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఫైనాన్షియల్ కంపెనీ నోమురా అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయడంతో ఇతర సిమెంట్ షేర్లు కూడా బుధవారం ర్యాలీ చేశాయి. మరోవైపు హిందాల్కో, బజాజ్ ఆటో షేర్లు 4 శాతం చొప్పున లాభపడగా, ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెవీవెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక శాతం ఎగసింది. బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.5 లక్షల కోట్లు పెరిగి రూ.361.4 లక్షల కోట్లకు చేరుకుంది. 

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎందుకు పెరిగిందంటే?
1. వచ్చే ఏడాది మార్చి నుంచి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. దీని ప్రభావం గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్లలో కనిపిస్తోంది. జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లండన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బుధవారం ఒకటిన్నర శాతం వరకు లాభపడ్డాయి.  
2. సాధారణంగా ఏడాది చివరి ఐదు రోజుల్లో, కొత్త ఏడాదిలోని మొదటి రెండు రోజుల్లో మార్కెట్లు పెరుగుతాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇలాంటి ట్రెండే తాజాగా కనిపిస్తోందని అన్నారు. గత 22 ఏళ్లలో 19 సార్లు  మార్కెట్ ఇలా లాభపడిందని చెప్పారు. 
3. ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐ)  ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.57,275 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు అమ్మే రోజు డొమెస్టిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు బయ్యర్లుగా మారుతున్నారు. 
4. క్రూడాయిల్ ధరలు కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 80 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. క్రూడ్ ధరల్లో వోలటాలిటీ లేకపోతే ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్లకు మేలు జరుగుతుంది. కాగా,  ఎర్ర సముద్రంలోని  షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై  హౌతి గ్రూప్ దాడులు  కొనసాగుతున్నా,  కొన్ని మేజర్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తమ జర్నీని మొదలు పెట్టాయి.
5. బ్యాంక్ షేర్లు బుధవారం ర్యాలీ చేశాయి. నిఫ్టీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1.17 శాతం పెరిగి 48,348 దగ్గర ఏడాది గరిష్టాన్ని తాకింది. 49 వేల లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టచ్ చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకొచ్చినట్టు కనిపిస్తోందని జేఎం ఫైనాన్షియల్ ఎనలిస్ట్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉందన్నారు. 
6.  నిఫ్టీ 21,500 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈజీగా దాటిందని, నెక్స్ట్ టార్గెట్ 21,750– 21,800 అని ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ రూపక్ డే అన్నారు. 21,500 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర పుట్ పొజిషన్లు తగ్గాయని, ఈ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుందని చెప్పారు. 

లిస్టింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

హ్యాపీ ఫోర్జింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్ షేర్లు ఇష్యూ ధర  రూ. 850 కంటే 21 శాతం ప్రీమి యంకు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్ట్ అయ్యాయి.  కంపెనీ షేర్లు రూ.1,001 దగ్గర ఓపెన్ అయ్యాయి.  రూ.1,030 దగ్గర ముగిశాయి. మరోవైపు క్రెడో బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్ షేర్లు లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరిగినా, ఇంట్రాడేలో   12 శాతం లాభప డ్డాయి. ఇష్యూ ధర రూ. 280 కాగా, రూ. 282 దగ్గర ఓపెన్ అయ్యాయి. రూ. 313 దగ్గర ముగిశాయి.