ఒక్క కొమ్మకే 839 టొమాటోలు

ఒక్క కొమ్మకే 839 టొమాటోలు

వేలల్లో.. కాదుకాదు లక్షల్లో మొక్కలు పెంచి రికార్డుకెక్కిన వాళ్లు చాలామందే ఉన్నారు మన చుట్టూరా. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్నాయన చాలా డిఫరెంట్‌. కాస్త వెరైటీగా టొమాటో మొక్క పెంచాడు. అందులో వింత ఏముంది? అంటారా. అందులోనే ఉంది అసలు కథ. ఒక్కటంటే ఒక్కటే టొమాటో కొమ్మకి ఏకంగా 839  టొమాటోలు కాశాయి ఇతని గార్డెన్​లో.  
టొమాటోలతో రికార్డుకెక్కిన ఈయన పేరు డగ్లస్​​ స్మిత్. బ్రిటన్​కి చెందిన డగ్లస్​కు ఇలాంటి ప్రయోగాలు  కొత్తేం కాదు. కిందటేడాది 3.1 కేజీల బరువు, 27.5 సెం.మీ టొమాటోని తన పెరట్లో పెంచాడు​. ఆ ఇన్​స్పిరేషన్​తోనే  ఈ ఏడాది మార్చిలో టొమాటో విత్తనం నాటాడు. వారానికి నాలుగ్గంటలు ఆ మొక్క బాగోగులకే కేటాయించాడు. దాని రిజల్టే  839 టొమాటోలు. ఇంతకుముందు 2010 లోనూ ఒక్క టొమాటో మొక్కకి 448 కాయలు కాయించి వరల్డ్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​కి ఎక్కాడు గ్రాహం టాంటెర్​ అనే వ్యక్తి. ఆ రికార్డుని  మొదటి ప్రయత్నంలోనే స్మిత్ బ్రేక్​  చేయడం విశేషం​.