ICRC: ఐసీఆర్సీలో భారీగా ఉద్యోగాలకు కోత

ICRC: ఐసీఆర్సీలో భారీగా ఉద్యోగాలకు కోత

కరోనా తర్వాత ఉద్యోగాల కోత ఆగడం లేదు. 2022 అక్టోబర్​ నుంచి ఇప్పటిదాకా గ్లోబల్​గా 5 లక్షల ఉద్యోగాలు పోయినట్లు బ్లూమ్​బర్గ్​ రిపోర్టు వెల్లడించింది.  మైక్రో సాఫ్ట్, గూగుల్ ,అమెజాన్ , మెటా వంటి టెక్ కంపెనీల తర్వాత ఉద్యోగాల కోత పెడుతున్న కంపెనీల జాబితాలో  లేటెస్ట్ గా  రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ(ICRC) చేరింది. 1500  ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించింది.  అంతేగాకుండా ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా సంస్థ కొన్ని కార్యక్రమాలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 

రానున్న  ఏడాదిలో 1500 ఉద్యోగాలు తొలగింపు

రాబోయే 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,500 ఉద్యోగాలను తొలగించాల్సి ఉంటుంది" అని ఐసీఆర్సీ  పేర్కొంది. రిక్రూట్ మెంట్ ను ఆపడం, పొజిషన్ లను తగ్గించడం వల్ల కొంత మంది ఉద్యోగులను తగ్గిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 ప్రాంతాల్లో కనీసం 20  కంపెనీలను మూసివేస్తామని వెల్లడించింది ఐసీఆర్సీ. ఇతర వ్యాపారస్థులు ఎవరైనా తమ కంపెనీలను స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. ఐసీఆర్సీలో 100 కంటే ఎక్కువ దేశాల్లో 20 వేల మంది సిబ్బంది ఉన్నారు.

ఒకవేళ గ్లోబల్​గా రెసిషన్​ వస్తే  ఈ ఉద్యోగాల కోత మరింత ఎక్కవయ్యే అవకాశాలున్నాయని బ్లూమ్​బర్గ్​ రిపోర్టు చెబుతోంది.  చాట్​జీపీటీ వంటి ఆటోమేషన్​ ట్రెండ్స్​ ఇప్పుడిప్పుడే సంచలనాలకు తెరతీస్తున్నాయని...ఉద్యోగాలపై వాటి ఎఫెక్ట్​ ఏమిటనేది తెలవడానికి మరికొంత సమయం పట్టొచ్చని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.