ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లకేసులో కీలక అప్డేట్..అమాయకుల ప్రాణాలు బలిగొన్న కారు బాంబు పేలుడులో ఉగ్రవాది ఉమర్ నబీకి సాయం చేసిన పరీదాబాద్ కు చెందిన సోయబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సోయబ్ అరెస్ట్ అయిన ఏడో నిందితుడు.
NIAతెలిపిన వివరాల ప్రకారం.. బాంబు దాడికి ముందు ఉమర్ నబీకి ఆశ్రయం కల్పించడమే కాకుండా లాజిస్టికల్ ఏర్పాట్లలో అతడికి సహాయం చేశాడన అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. వసతి, దాడికి ప్లాన్ చేసే సమయంలో ఉమర్ ను ఎవరూ గుర్తించకుండా సోయబ్ కార్యచరణ మద్దతు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
నవంబర్ 10 న ఢిల్లీలోని ఎర్ర కోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో అనేక మంది అమయాకులు ప్రాణాలు కోల్పోయారు. చారిత్రక చిహ్నం అయిన రెడ్ ఫోర్ట్ దగ్గర ఈ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పుల్వామా దాడి తర్వాత ఈ అతిపెద్ద ఉగ్రదాడి ఇది. ఈ పేలుడులో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ ఎర్రకోట పేలుడు కు కారణమైన వారిని ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
