
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సైనిక బలగాలు మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాయి. వేదిక ముందు రిహార్సల్స్ కొనసాగుతుండగా.. ఆర్మీ హెలికాప్టర్ వారిపై పూల వర్షం కురిపించింది. మరోవైపు, అతిథుల కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.