చైనా కంపెనీ షావోమీ ..రెడ్మీ ఏ2, రెడ్మీ ఏ2 ప్లస్ అనే రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్స్ లో మీడియా టెక్ హీలియో జీ 36 ఎస్ఓసీ చిప్ సెట్ ను అమర్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6.52 అంగుళాల స్క్రీన్ ఉంటాయి.
రెడ్మీ ఏ2ప్లస్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. రెడ్మీ ఏ2కి, ఏ2 ప్లస్‌కు ఇదొక్కటే తేడా. రెడ్మీ ఏ2... 2 జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 5,999 గా ఉంది. 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 6,499 లకు లభిస్తుంది. 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్మీ ఏ2 వేరియంట్ ధర రూ. 7,499 గా ఉంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్మీ ఏ 2 ప్లస్ ధర రూ. 8,499.
