రెడ్మీ ఇండియా కొత్త ఆలోచన.. ఇంటికి వచ్చి ఫోన్ రిపేర్ చేస్తం

రెడ్మీ ఇండియా కొత్త ఆలోచన.. ఇంటికి వచ్చి ఫోన్ రిపేర్ చేస్తం

రెడ్ మీ.. ఈ బ్రాండ్ కు ఇండియాలో ఓ క్రేజ్ ఉంది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు అందిస్తారని పేరు ఉంది. అందుకే చాలామంది ఈ బ్రాండ్ ఫోన్ లు కొనడానికి ఇష్టపడుతుంటారు. లో బడ్జెట్ వేరియంట్ లో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఫోన్ లిస్ట్ లో రెడ్ మీ బ్రాండ్ టాప్ ప్లేసులో ఉంది. ఈ ఫోన్ కు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువే. ఇంట్లో వాళ్లకి గిఫ్ట్ ఇవ్వడానికి ఈ బ్రాండ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.  

అయితే, చాలా ప్రదేశాల్లో రెడ్ మీ బ్రాండ్ సర్వీ్స్ స్టేషన్ లు ఉండవు. వాటిని ఎలా.. వినియోగించాలో తెలియదు. స్క్రీన్ డ్యామేజ్ లాంటివి ఏం జరిగినా వాటిని లోకల్ లో ఉండే రిపేర్ షాప్స్ లో నాసిరకం సర్వీస్ చేయిస్తుంటారు. అందుకే రెడ్ మీ ఇండియా ఓ ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇకనుంచి భారత్ లో ఫోన్ సర్వీస్ లను తమ డోర్ స్టెప్ అంటే.. మీ ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ చేసిపెడుతుంది.

రెడ్ మీ డోర్ స్టెప సర్వీస్ ఎలా పొందాలంటే.. 

రెడ్ మీ ఇచ్చే కస్టమర్ కేర్ సర్వీస్ లేదా క్యూఆర్ కోడ్ నుంచి వాళ్ల కస్టమర్ కేర్ ను సంప్రదించాలి. తర్వాత వాళ్లు అడిగే ప్రాసెస్ కంప్లీట్ చేసి సర్వీస్ స్లాట్ ను బుక్ చేసుకోవాలి. 

అప్పుడు ఒక డేట్, టైంతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. ఆ డేట్ లో సర్వీస్ సెంటర్ నుంచి వచ్చి సర్వీ్స్ చేసి వెళ్తారు. సర్వీస్ అంతా పూర్తయ్యాకనే డబ్బులు ఇవ్వాలి. దీనివల్ల కస్టమర్లకు మంచి సర్వీస్ అందుతుందని రెడ్ మీ ఇండియా చెప్తోంది.