తగ్గిన ఇన్​ఫ్రా సెక్టార్ల గ్రోత్

తగ్గిన ఇన్​ఫ్రా సెక్టార్ల గ్రోత్

న్యూఢిల్లీ: ప్రధానంగా ముడి చమురు, సహజ వాయువు, కరెంట్​ఉత్పత్తిలో తగ్గుదల కారణంగా ఎనిమిది కీలకమైన మౌలిక సదుపాయాల రంగాల వృద్ధి ..అంటే ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచీ (ఐసీఐ) ఈ ఏడాది మేలో 4.3 శాతానికి తగ్గింది.  కోర్​ సెక్టార్​ వృద్ధి 19.3 శాతం ఉంది. 

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-మే మధ్య కాలంలో ఈ ఎనిమిది రంగాల ఉత్పత్తి వృద్ధి 14.3 శాతం నుంచి 4.3 శాతానికి పడిపోయింది.  బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, కరెంటు సెక్టార్లు ఐసీఐలో ఉన్నాయి.