నగరాల్లో తగ్గిన ఇండ్ల అమ్మకాలు

నగరాల్లో తగ్గిన ఇండ్ల అమ్మకాలు
  • హైదరాబాద్​లో కొద్దిగా పెరుగుదల         
  • ముంబైలో ఎనిమిది శాతం తగ్గుదల

న్యూఢిల్లీ:దేశమంతటా ఈ ఏడాది జనవరి–జూన్​ (హెచ్​1) మధ్య ఎనిమిది నగరాల్లో అమ్మకాలు వార్షికంగా ఒకశాతం తగ్గాయి. అయితే ఆఫీస్​స్పేస్​ లీజింగ్​ మాత్రం మూడుశాతం పెరిగింది. రియల్​ ఎస్టేట్​ కన్సల్టెన్సీ నైట్​ఫ్రాంట్​ రిపోర్ట్​ ప్రకారం.. ఇండ్ల ధరలు వార్షికంగా 2–10 శాతం వరకు పెరిగాయి. 2022 హెచ్​1లో 1,58,705 యూనిట్లు అమ్ముడుపోగా ఈ ఏడాది హెచ్​1లో  1,56,640  యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆఫీసు లీజింగ్​స్పేస్​ మాత్రం 25.3 మిలియన్​ చదరపు అడుగుల నుంచి 26.1 మిలియన్​ చదరపు అడుగులకు పెరిగింది. నైట్​ఫ్రాంక్​ ఇండియా సీఎండీ శిశిర్​ బైజాల్​​ మాట్లాడుతూ హోంలోన్లపై వడ్డీరేట్లు పెరిగినా, ఇంటర్నేషనల్​ మార్కెట్లలో ఇబ్బందులు ఉన్నా మనదేశ రియల్టీ మార్కెట్లు నిలకడగానే ఉన్నాయని చెప్పారు. హౌజింగ్​ మార్కెట్లలో పాజిటివ్​ సెంటిమెంట్​కనిపించిందని, లగ్జరీ ఇండ్ల సేల్స్​ బాగున్నాయని అన్నారు. చౌక ధరల ఇండ్ల అమ్మకాలు మాత్రం తగ్గాయని వివరించారు. ముంబైలో ఇండ్ల విక్రయాలు జనవరి–-జూన్‌‌‌‌లో 44,200 యూనిట్ల నుంచి 8 శాతం తగ్గి 40,798 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక్కడ గ్రాస్​ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 3 మిలియన్ చదరపు అడుగుల నుంచి 9 శాతం పెరిగి 3.2 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.ఢిల్లీలో ఇండ్ల అమ్మకాలు 3 శాతం పెరిగి 29,101 యూనిట్ల నుంచి 30,114 యూనిట్లకు చేరుకున్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్​ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 4.1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 5.1 మిలియన్ చదరపు అడుగులకు.. 24 శాతం పెరిగింది.    బెంగళూరులో  ఇండ్ల సేల్స్​ 26,677 యూనిట్ల నుంచి 2 శాతం తగ్గి 26,247 యూనిట్లకు చేరాయి.  ఆఫీస్ లీజింగ్ 7.7 మిలియన్ చదరపు అడుగుల నుంచి 10 శాతం తగ్గి 7 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.పూణెలో ఇండ్ల విక్రయాలు ఒకశాతం తగ్గి 21,797 యూనిట్ల నుంచి 21,670 యూనిట్లకు పడిపోయాయి. 

ఆఫీసు స్థలం లీజు 3.3 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2.3 మిలియన్ చదరపు అడుగులకు..అంటే 30 శాతం తగ్గింది.చెన్నైలో ఇండ్ల సేల్స్​ 3 శాతం పెరిగి 6,951 యూనిట్ల నుంచి 7,150 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక్కడ ఆఫీసు స్థలం లీజింగ్​2.2 మిలియన్ చదరపు అడుగుల నుంచి 4.5 మిలియన్ చదరపు అడుగులకు.. అంటే రెండు రెట్లు పెరిగింది.    హైదరాబాద్‌‌‌‌లో ఇండ్ల విక్రయాలు 5 శాతం ఎగిసి 14,693 యూనిట్ల నుంచి 15,355 యూనిట్లకు పెరిగాయి.   ఆఫీసు స్థలం లీజింగ్​8 శాతం తగ్గి 3.2 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.కోల్‌‌‌‌కతాలో హౌజింగ్​ ప్రాపర్టీల విక్రయాలు 3 శాతం పెరిగి 7,090 యూనిట్ల నుంచి 7,324 యూనిట్లకు చేరుకున్నాయి.  

ఆఫీస్ డిమాండ్ 3 శాతం తగ్గి 0.6 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.    అహ్మదాబాద్‌‌‌‌లో హౌసింగ్ సేల్స్​ 3 శాతం తగ్గి 8,197 యూనిట్ల నుంచి ఈ ఏడాది జనవరి–-జూన్ కాలంలో 7,982 యూనిట్లకు పడిపోయాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ గత హెచ్​1లో 1.3 మిలియన్ చదరపు అడుగుల నుంచి ఈ సంవత్సరం హెచ్​1లో 59 శాతం తగ్గి 0.5 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.