హైదరాబాద్‌‌‌‌లో తగ్గిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌‌‌‌లో తగ్గిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు

2021 లోని 83,950 యూనిట్ల నుంచి 68,519 యూనిట్లకు డౌన్‌

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్లు  కిందటేడాది 18 శాతానికి పైగా తగ్గాయి. 2021 లో 83,959 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్ జరగగా, 2022 లో ఈ నెంబర్ 68,519 కి పడిపోయింది. వాల్యూ పరంగా చూస్తే, 2021 లో 37,231 కోట్ల విలువైన ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని, కిందటేడాది ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ 10 శాతం తగ్గి రూ. 33,605 కోట్లుగా  నమోదయ్యిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌‌‌‌ఫ్రాంక్ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. మరోవైపు ఇండస్ట్రీ వర్గాలు మాత్రం  అమ్మకాలు బాగున్నాయని ,  ధరణి పోర్టల్‌‌‌‌లో ఇబ్బందులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వలనే ఇండ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయని వివరించాయి. అంతేకాకుండా కరోనా వలన 2019, 2020 లో పెండింగ్‌‌‌‌లో ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు 2021 లో పూర్తయ్యాయని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ రామచంద్రా రెడ్డి అన్నారు. 2021 మధ్య నుంచి కొత్త ప్రాజెక్ట్‌‌‌‌ లాంచ్‌‌‌‌లు మొదలయ్యాయని, ఫలితంగా 2022 లో రిజిస్ట్రేషన్లు తగ్గాయని వివరించారు. 2023 లో  రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని అంచనావేశారు. 2018 తర్వాత నుంచి హైదరాబాద్‌‌‌‌లో ఏడాదికి సగటున 50 వేల ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. నైట్‌‌‌‌ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం,  కిందటి నెలలో  6,311  రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది నెలవారీని చూస్తే 2.4 శాతం ఎక్కువని, ఏడాది ప్రాతిపదికన చూస్తే 26 శాతం తక్కువని ఈ రిపోర్ట్ వెల్లడించింది.2021లోని డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 8,506 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కిందటి నెలలో రూ. 3,176 కోట్ల  విలువైన ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా, హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ కింద  హైదరాబాద్‌‌‌‌, మేడ్చల్–మల్కాజ్‌‌‌‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. 

రూ.25-5‌‌‌‌‌‌‌‌0 లక్షల ప్రాపర్టీలకు  గిరాకీ.. 

కిందటి నెలలో జరిగిన మొత్తం ఇండ్ల రిజిస్ట్రేషన్లలో 54 శాతం వాటా రూ.25 నుంచి రూ.50 లక్షల మధ్య ఉన్న ప్రాపర్టీలదే ఉంది. ఈ సెగ్మెంట్ వాటా ఏడాది ప్రాతిపదికన  18 శాతం పెరిగింది.  కానీ, రూ.25 లక్షల కంటే తక్కువ వాల్యూ ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో తగ్గాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఈ సెగ్మెంట్ వాటా 40 శాతం నుంచి 17 శాతానికి తగ్గింది. పెద్ద ఇండ్లకు మాత్రం మంచి డిమాండ్ కనిపించింది. రూ.50 లక్షల కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీల   వాటా మొత్తం రిజిస్ట్రేషన్లలో 29 శాతానికి పెరిగింది. 2021 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఈ సెగ్మెంట్‌‌‌‌ వాటా 24 శాతంగా ఉంది. 500 నుంచి 1000 చదరపు అడుగుల  మధ్య విస్తీర్ణం ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 20 శాతానికి ఎగిసిందని నైట్‌‌‌‌ఫ్రాంక్ వెల్లడించింది.  1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీల వాటా మాత్రం 70 శాతంగా నమోదయ్యింది. దీని బట్టి వెయ్యి చదరపు అడుగల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీలకు డిమాండ్ కొనసాగుతోందని చెప్పొచ్చు. జిల్లాల వారీగా చూస్తే, మేడ్చల్–మల్కాజ్‌‌‌‌గిరిలో ఎక్కువ ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఈ జిల్లా వాటా 42 శాతంగా రికార్డయ్యింది. రంగారెడ్డి జిల్లా వాటా 36 శాతంగా, హైదరాబాద్‌‌‌‌ జిల్లా వాటా 16 శాతంగా నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లా వాటా 6 శాతంగా ఉంది.  కిందటి నెలలో హైదరాబాద్‌‌‌‌లో జరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లలో చదరపు అడుగు సగటు ధర రూ.4,237 గా ఉంది. మేడ్చల్–మల్కాజ్‌‌‌‌గిరిలో రూ.2,987 గా, రంగారెడ్డిలో  రూ. 4,155 గా, సంగారెడ్డిలో రూ.2,990 గా నమోదయ్యింది. 

కరోనా తర్వాత కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, ముడిసరుకుల ఖర్చులు పెరిగాయి. దీంతో  ఒకప్పుడు రూ. 25 లక్షల కంటే తక్కువ విలువున్న ఇండ్లు అఫోర్డబుల్‌‌‌‌గా ఉండగా, ప్రస్తుతం రూ.25–50 లక్షల సెగ్మెంట్‌‌‌‌ అఫోర్డబుల్‌‌‌‌ ఇండ్లుగా మారాయి. సిటీలో అన్ని ఏరియాల్లో  రియల్‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్ డెవలప్ అవుతోంది. వెస్ట్ సైడ్‌‌‌‌ ధరలు పెరగడంతో పాటు, జనాభా ఎక్కువవ్వడంతో ఈస్ట్‌‌‌‌, నార్త్ వైపు  బయ్యర్లు చూస్తున్నారు.

- క్రెడాయ్ తెలంగాణ, చైర్మన్  రామచంద్రారెడ్డి