తగ్గిన నెక్సాన్ ఈవీ ధర

తగ్గిన నెక్సాన్ ఈవీ ధర

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌‌ తన ఫ్లాగ్‌‌షిప్ ఈవీ మోడల్‌‌  నెక్సాన్‌‌ ధరలను తగ్గించింది. అంతేకాకుండా ఈ మోడల్‌‌లో మ్యాక్స్ వేరియంట్‌‌ను మరింత మెరుగుపరిచింది.  తాజాగా ఎక్స్‌‌యూవీ 400 మోడల్‌‌తో మహీంద్రా అండ్ మహీంద్రా  ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎస్‌‌యూవీ ధర రూ. 15.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.  నెక్సాన్ ఈవీ ప్రైమ్‌‌ ఎక్స్‌‌ఎం వేరియంట్ రేటును రూ. 14.49 లక్షలకు టాటా మోటార్స్ తగ్గించింది. గతంలో ఈ కారు ధర రూ.14.99 లక్షలుగా ఉంది.  

నెక్సాన్‌‌ ఈవీ మ్యాక్స్‌‌ వేరియంట్‌‌  ఈ నెల 25 నుంచి  ఫుల్ ఛార్జ్‌‌పై 453 కి.మీ వరకు ప్రయాణించగలదని  కంపెనీ చెబుతోంది.  ఇప్పటికే ఈ వేరియంట్‌‌ కొన్న కస్టమర్లు డీలర్‌‌‌‌షిప్‌‌ దగ్గరకు వెళ్లి సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను అప్‌‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ పొందొచ్చు. వచ్చే నెల 15 నుంచి ఈ ప్రాసెస్ స్టార్టవుతుంది.