
న్యూఢిల్లీ: కీలక రంగాల పనితీరు కొలిచే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) ఈ ఏడాది జులైలో 2 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందు నెలలో నమోదైన 2.2 శాతం గ్రోత్‌తో పోలిస్తే తగ్గింది. వర్షాకాల ప్రభావంతో ఎనర్జీ సెక్టార్‌లో ప్రొడక్షన్ పడిపోయింది. మొత్తం 8 ప్రధాన సెక్టార్లలోని నాలుగింటిలో ఉత్పత్తి తగ్గింది.
బొగ్గు ఉత్పత్తి ఏడాది లెక్కన జులైలో 12.3 శాతం తగ్గగా, క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ 1.4శాతం, నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్ 3.2శాతం తగ్గాయి. పెట్రోలియం రిఫైనింగ్ కూడా తగ్గింది. అయితే స్టీల్ ప్రొడక్షన్ 12.8శాతం, సిమెంట్ ప్రొడక్షన్ 11.7శాతం వృద్ధి చెందాయి. విద్యుత్ ఉత్పత్తి 0.5శాతం పెరిగింది.