క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌పై తగ్గిన విండ్‌‌‌‌‌‌‌‌ఫాల్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌

క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌పై తగ్గిన విండ్‌‌‌‌‌‌‌‌ఫాల్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో ఉత్పత్తి అయిన క్రూడ్‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌పై విండ్‌‌‌‌‌‌‌‌ఫాల్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం తగ్గించింది. రెండు వారాల కిందటి వరకు టన్ను క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌పై రూ.7,100 విండ్‌‌‌‌‌‌‌‌ఫాల్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వేయగా, తాజాగా  దీన్ని రూ.6,700 కి ఫైనాన్స్ మినిస్ట్రీ తగ్గించింది. కానీ, డీజిల్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులపై వేస్తున్న స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఎడిషనల్‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ (ఎస్‌‌‌‌‌‌‌‌ఏఈడీ) ని లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.5.50 నుంచి రూ.6 కి పెంచింది. 

ఏవియేషన్ టర్బైన్‌‌‌‌‌‌‌‌ ఫ్యూయల్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులపై వేస్తున్న సుంకాన్ని లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.2 నుంచి రూ.4 కి పెంచింది. పెట్రోల్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులపై వేస్తున్న ఎస్‌‌‌‌‌‌‌‌ఏఈడీ మాత్రం సున్నాగానే  ఉంది. క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో  2022, జులైలో విండ్‌‌‌‌‌‌‌‌ఫాల్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వేయడాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతీ రెండు వారాలకు ఒకసారి ఈ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లను రివ్యూ చేస్తోంది.