కాళేశ్వరంపై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ

కాళేశ్వరంపై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ

హైదరాబాద్: కాళేశ్వరంపై ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. జూన్ 6, 2024న కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ కు రానున్నారు.  ఇప్పటి వరకు అందిన రిపోర్టులు, వచ్చిన ఫిర్యాదులను మొదటగా పరిశీలించనున్నారు. ఆతర్వాత రెండో వారంలో పలువురికీ సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. 

కాళేశ్వరం ప్రాజెక్టకు పనిచేసిన ఈఎన్సీలు, ఇంజనీర్లు, మాజీ అధికారులను పిలిచి..వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఫిర్యాదులు చేసిన వారిని సైతం పిలిచి విచారణ చేయనున్నారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్.

ఇవాళ్టీతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణకు గడువు ముగిసింది. మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం లోని బ్యారేజీలను కమిషన్ సభ్యులు రెండు సార్లు విజిట్ చేశారు.