
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో 96వ కామన్ ఫౌండేషన్ కోర్సు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా హ్యాపీ వ్యాలీ కాంప్లెక్స్‌ను దేశానికి అంకితం ఇచ్చారు. కొత్త ప్రపంచంలో మన పాత్రను పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. కాబోయే అధికారుల మనసులో ఆత్మ నిర్భర్ భారత్‌తో పాటు ఆధునిక భారతదేశం లక్ష్యంగా ఉండాలన్నారు. నిజమైన అనుభూతి కోసం ఫీల్డ్‌లో పనిచేయాలని ట్రైనీ అధికారులకు నరేంద్ర మోడీ సూచించారు.