క్రిప్టోల కట్టడికి అన్ని దేశాలు ఒక్కటి కావాలి 

క్రిప్టోల కట్టడికి అన్ని దేశాలు ఒక్కటి కావాలి 

బెంగళూరు: అన్ని దేశాల సహకారం లేకుండా క్రిప్టో కరెన్సీలను నియంత్రించినా ప్రయోజనం ఉండబోదని కేంద్ర ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ స్పష్టం చేశారు. అంతవరకు వీటిపై భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకోబోదని అన్నారు. క్రిప్టోలపై ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని, లేకుంటే నియంత్రణ సరిగ్గా ఉండదని స్పష్టం చేశారు. క్రిప్టోలను కంట్రోల్​ చేయడం అంటే 'డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ'ని నియంత్రించడం కాదని,  ఇది ఎంతో మంచి టెక్నాలజీ అని మంత్రి  అన్నారు. "ప్రస్తుతం భారతదేశానికి జీ20 అధ్యక్ష పదవి ఉంది. క్రిప్టోల రెగ్యులేషన్​ అంశాన్ని మేం ఎజెండాలో చేర్చాం. ఐఎంఎఫ్ ​క్రిప్టోపై ఒక డాక్యుమెంలట్​ను ఇచ్చింది. ఇది స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. జీ20 ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్​ఎస్​బీ), ఆర్థిక స్థిరత్వంపై కూడా దృష్టి సారించే రిపోర్ట్​ను ఇవ్వడానికి అంగీకరించింది. ఎఫ్​ఎస్​బీ, ఐఎంఎఫ్​ రిపోర్టుల గురించి ఈ ఏడాది​ జులైలో ఆర్థిక మంత్రులు,  సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు చర్చిస్తారు. ఇదే ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాలోనే జీ20 దేశాల ప్రధానమంత్రుల,  అధ్యక్షుల సమావేశం జరుగుతుంది" అని ఆమె  చెప్పారు. బెంగళూరులో 'థింకర్స్ ఫోరమ్, కర్ణాటక' అనే సంస్థ ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ సందర్భంగా డిజిటల్ లేదా క్రిప్టో కరెన్సీని నియంత్రించడంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. జీ20  ఇండియన్  ప్రెసిడెన్సీలో మొదటి జీ20 ఆర్థిక మంత్రులు  సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్​ఎంసీజీ) సమావేశం ఫిబ్రవరి 24-–25 మధ్య బెంగళూరులో జరిగింది.  డిజిటల్ కరెన్సీలు పూర్తిగా డిజిటలైజ్ అయ్యాయని, టెక్నాలజీతో నడిచే క్రిప్టోలను ఏ ఒక్క దేశం కూడా దానిని సమర్థవంతంగా నియంత్రించలేదని అన్నారు.  జీ20 ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్) ఐఎంఎఫ్​, ప్రపంచ బ్యాంక్ మొదలైన ఇతర సంస్థలతో కలిసి  క్రిప్టోలపై ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.   

పోంజీ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అరికడతాం 

పోంజీ మొబైల్​ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అరికట్టేందుకు తమ శాఖ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ​ఐటీ మంత్రిత్వశాఖ (మైటీ), ఆర్​బీఐ లతో కలిసి పనిచేస్తోందని నిర్మల తెలిపారు. పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించిన డబ్బును ఇవి మోసపూరితంగా లాక్కుంటున్నాయని చెప్పారు.  పోంజీ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెట్టుబడిదారులను హెచ్చరించిన ఆమె,  యాప్స్​ ఇచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దని సూచించారు. ఫలానా మొత్తం పెట్టుబడి పెడితే ‘అంత వస్తుంది.. ఇంత వస్తుంది’ అంటూ ఊరించే ప్లాట్​ఫారమ్స్​కు దూరంగా ఉండాలని అన్నారు. సోషల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫైనాన్షియల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏం చెప్పినా, మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకోవాలని, పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు చెక్​ చేసుకోవాలని అన్నారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లను  నియంత్రించడానికి ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదనా లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. ఇద్దరో ముగ్గురో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు మంచి సలహాలే ఇచ్చినా, మిగతా ఏడుగురు ఇవ్వకపోవచ్చని స్పష్టం చేశారు.  క్రమబద్ధీకరణ లేని డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ప్రభుత్వం 2019లోనే చట్టం తెచ్చిందని చెప్పారు. గుర్తింపులేని సంస్థలు డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సేకరించకుండా ఇది అడ్డుకుంటుందని అన్నారు. పోంజీ పథకం అంటే ఒక మోసపూరిత పెట్టుబడి విధానం. ఇందులో మొదట చేరిన వారికి తరువాత చేరిన ఇన్వెస్టర్లు పెట్టిన డబ్బును చెల్లిస్తుంటారు. ఇది పిరమిడ్​ స్కీమ్​ మాదిరి ఉంటుంది.