ఇంజినీరింగ్ స్టూడెంట్స్కు అలర్ట్.. ఫీజులు భారీగా పెరుగుతున్నాయ్.. వివరాలు ఇవిగో

ఇంజినీరింగ్ స్టూడెంట్స్కు అలర్ట్.. ఫీజులు భారీగా పెరుగుతున్నాయ్.. వివరాలు ఇవిగో

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరుగుతున్నాయ్. కొన్ని కాలేజీల్లో ఫీజులు ఆల్ మోస్ట్ డబుల్ అవ్వనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి పెంచిన ఫీజుల రిపోర్టును ప్రభుత్వానికి పంపించింది రెగ్గులేటరీ బోర్డు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అందులో 19 ప్రభుత్వ, 156 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఈ సారి 60 పైగా కాలేజీల్లో రూ.2 లక్షల వరకు ఫీజులు పెంచనున్నారు. మిగతా కాలేజీల్లో రూ.50 వేలకు వరకు పెరుగుతున్నాయి.

Also Read:-ఈ ఫేమస్ ఇన్వెస్టర్ ట్వీట్ చూసి డిసైడ్ అవడం బెటరేమో..!

తెలంగాణలో టాప్ కాలేజీల్లో ఫీజులు అత్యధికంగా పెంచేందుకు ప్లా్న్ చేస్తున్నారు. మూడు నాలుగు కాలేజీల్లో 2 లక్షలకు పైగా పెంచనున్నారు. CBIT, VNR, వాసవి, MGIT కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. పెంచిన ఫీజులు వచ్చే సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి.