అదృష్టం ఇలా ఉండాలి: రోజుకు రూ.40 కోట్లు.. 60 రోజుల్లో 2వేల 400 కోట్లు

అదృష్టం ఇలా ఉండాలి: రోజుకు రూ.40 కోట్లు.. 60 రోజుల్లో 2వేల 400 కోట్లు

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు పెట్టే వారికి ఈ పేరు సుపరిచితమే. ఓ రకంగా చెప్పాలంటే స్టాక్‌ మార్కెట్‌కూ ఆయనకూ విడదీయలేని బంధం. స్టాక్స్‌లో పట్టిందల్లా బంగారమై లాభాలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. ప్రస్తుతానికి ఆయన స్వర్గస్తులయినప్పటికీ.. వారి సతీమణి రేఖ ఝున్‌ఝున్‌వాలా ఆ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఆమె కూడా సంపాదనలో భర్తకు ఏమాత్రం తీసిపోవడం లేదు. గత 60 రోజుల్లో ఆమె రూ.2400 కోట్ల లాభాలు ఆర్జించారు. 

గత రెండు నెలల్లో టైటాన్ షేర్లు 65 శాతం వృద్ధి చెందాయి. షేరు ధర రూ.512 పెరిగింది. ఈ కారణంగా టాటా కంపెనీలో షేర్ హోల్డర్ అయిన రేఖా జున్‌జున్‌వాలా రోజుకు రూ.40 కోట్లు చొప్పున.. గత రెండు నెలల్లో 2వేల 400 కోట్లు లాభాలు ఆర్జించారు. టైటాన్ షేర్లలో రేఖా జున్‌జున్‌వాలాకు పెద్ద ఎక్స్‌పోజర్ ఉంది. జనవరి నుండి మార్చి 2023 త్రైమాసికంలో టైటాన్ కంపెనీ షేర్‌హోల్డింగ్ విధానం ప్రకారం.. ఆమె 4,69,45,970 టైటాన్  షేర్లు కలిగి ఉన్నారు.  దాదాపు 4,69,45,970 షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీ మూలధనంలో దాదాపు 5.29 శాతం.

రేఖ జున్‌జున్‌వాలా సెప్టెంబర్ 12, 1963న ముంబైలో జన్మించారు. ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రస్తుత,ఎం ఆమె నికర ఆస్తుల విలువ 47,650 కోట్లు.