
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ కోసం ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఆమె అధికారికంగా ఆ పార్టీలో చేరనప్పటికీ టికెట్ కోసమైతే దరఖాస్తు చేశారు. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే పోటీ చేసేందుకు ధరఖాస్తులో పేర్కొన్నారు. రేఖా నాయక్ తరఫున ఆమె పీఏ గాంధీభవన్ లో దరఖాస్తు చేశారు.
ALSO READ : పాకిస్థాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిందా .. క్లారిటీ ఇచ్చిన రక్షణ మంత్రిత్వ శాఖ
ఇక ఆమె భర్త శ్యాం నాయక్ ఆసిఫాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ కు సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో ఆమె ఈ రోజు పార్టీకి రాజీనామా చేయనున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తో్ంది. ఇప్పటికే ఆమెభర్త శ్యాం నాయక్ కాంగ్రెస్ లో చేరారు. కాగా ఖానాపూర్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్‌ను బరిలోకి దింపారు కేసీఆర్.