అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను  అంబేద్కర్ యూనివర్శిటీ ప్రకటించింది. మొదటి ఏడాది విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు మార్చి 13 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. రెండో ఏడాది విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు మార్చి 21 నుంచి మార్చి 27 వరకు జరుగుతాయి. పరీక్షలు రాసే విద్యార్ధులు ఫిబ్రవరి 16లోపు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయత్రం 5గంటల వరకు జరుగుతాయని యూనివర్శిటీ పరీక్షల నిర్వాహకులు తెలిపారు. కరోనా క్రమంలో అన్ని ఏర్పాట్లను చేస్తున్నామనీ.. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూస్తున్నామని చెప్పారు. థియరీ పరీక్షలతోపాటు, ప్రాక్టికల్ పరీక్షలకు కూడా ఒకేసారి ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. టీఎస్, ఏపీ ఆన్ లైన్ సెంటర్ల ద్వారా కానీ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కానీ ఆన్ లైన్ లోనే చెల్లింపులు ఉంటాయన్నారు. ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే 040-23680241/254 ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ కావాల్సిందిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్షల నిర్వాహకులు స్పష్టం చేశారు.