విలీన ఒప్పందంపై రిలయన్స్​, డిస్నీ సంతకాలు

విలీన ఒప్పందంపై రిలయన్స్​, డిస్నీ సంతకాలు

న్యూఢిల్లీ: గ్లోబల్ మీడియా కంపెనీ వాల్ట్ డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేయడానికి 70 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాయి.  ఫలితంగా భారతీయ మీడియా,  వినోద రంగంలో అతిపెద్ద జాయింట్​ వెంచర్​ను సృష్టిస్తాయి. కొత్త సంస్థకు అనేక భాషలలో 100 ఛానెల్స్​, 2  ఓటీటీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లు,   75 కోట్ల మంది ప్రేక్షకులు ఉంటారు.  

వయాకామ్ 18  మీడియా సంస్థ కోర్టు ఆమోదించిన స్కీమ్ ఆఫ్ అరేంజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా స్టార్ ఇండియాలో విలీనం అవుతుంది.    జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా ఉదయ్ శంకర్ వ్యవహరిస్తారు. కొత్త సంస్థలో రిలయన్స్​కు 63.16 శాతం, డిస్నీకి మిగిలిన 36.84 శాతం వాటా ఉంటుంది. ఓటీటీ వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌లో 11,500 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్​ చేయడానికి రిలయన్స్  అంగీకరించింది. ఈ డీల్​ 2024 క్యాలెండర్ సంవత్సరం చివరి క్వార్టర్​లో లేదా 2025 మొదటి క్వార్టర్​లో పూర్తవుతుందని భావిస్తున్నారు.