న్యూ ఎనర్జీ బిజ్ ద్వారా రిలయన్స్​కు రూ. 1.23 లక్షల కోట్లు

న్యూ ఎనర్జీ బిజ్ ద్వారా రిలయన్స్​కు రూ. 1.23 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ 2030 నాటికి సోలార్ నుంచి హైడ్రోజన్ వరకు విస్తరించి ఉన్న కొత్త ఇంధన వ్యాపారం నుంచి  10–-15 బిలియన్ డాలర్ల (రూ.1.23 లక్షల కోట్ల) ను సంపాదింవచ్చని  శాన్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్ సి బెర్న్‌‌‌‌‌‌‌‌స్టెయిన్ నివేదిక పేర్కొంది. ఇందుకోసం విలీనాలు, పార్ట్​నర్​షిప్​లు అవసరమని పేర్కొంది. క్లీన్ ఎనర్జీ (సోలార్, బ్యాటరీ, ఎలక్ట్రోలైజర్‌‌‌‌‌‌‌‌లు, ఫ్యూయల్​సెల్స్) రంగంలోకి 2050 నాటికి భారతదేశంలో  2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయి. దీంతో రిలయన్స్‌‌‌‌‌‌‌‌ ఆదాయం భారీగా పెరుగుతుంది. భారతదేశం 2030 నాటికి 280 గిగావాట్ల సోలార్​ పవర్​,  ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్​ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.

 క్లీన్ ఎనర్జీకి 2030 నాటికి  30 బిలియన్ డాలర్ల (ప్రస్తుతం  10 బిలియన్) టామ్​ (టోటల్ అడ్రసబుల్ మార్కెట్​) ఉండొచ్చని శాన్​ఫోర్ట్​ తెలిపింది. 2050 నాటికి టామ్​ 200 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని  పేర్కొంది. రిలయన్స్ 2030 నాటికి 100 గిగావాట్ల ఇన్​స్టాల్డ్​ సోలార్​ పవర్​ కెపాసిటీ ఉండాలని కోరుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన 280 గిగావాట్ల సామర్థ్యంలో ఇది 35 శాతం. 2030 నాటికి, రిలయన్స్ వరుసగా 60 శాతం, 30 శాతం  20 శాతం సోలార్, బ్యాటరీ  హైడ్రోజన్ టామ్​లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని బెర్న్‌‌‌‌‌‌‌‌స్టెయిన్ చెప్పారు. ఫలితంగా న్యూ ఎనర్జీ వ్యాపారం నుంచి  10-–15 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలదని అంచనా వేస్తున్నామని చెప్పారు.