
హైదరాబాద్, వెలుగు: రిలయన్స్ డిజిటల్ హైదరాబాద్‌లో మరో స్టోర్ ను ఆరంభించింది. హయత్ నగర్ లోని ఆర్టీసీ సూపర్ వైజర్స్ కాలనీ ఎదురుగా ఇది ఉంటుంది. దీనిని నటి నభా నటేశ్ ప్రారంభించారు. స్టోర్ 8,000 చదరపు అడుగుల్లో విస్తరించింది. స్మార్ట్‌ఫోన్‌లు, వాషింగ్ మెషీన్ల వంటి ఎన్నో రకాల ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కస్టమర్లకు సాయపడటానికి నిపుణులైన టెక్ స్క్వాడ్‌ను నియమించారు. ఎలక్ట్రానిక్స్ కొనుగోలు అనంతర సర్వీసును అందించడానికి ప్రత్యేకంగా రెస్క్యూ సర్వీస్ టీమ్ఉంటుంది. ఎర్లీ బర్డ్ ఆఫర్లతోపాటు ప్రముఖ బ్యాంక్ కార్డులపై 10శాతం వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.